పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పిఠాపురం నుంచి రోడ్డు మార్గం ద్వారా యూ కొత్తపల్లి మండలం ఉప్పాడ చేరుకుని.. పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రెండు కోట్ల రూపాయలతో నిర్మించే తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం, 48 లక్షలతో నిర్మించునున్న చేబ్రోలు సీతారామస్వామి ఆలయ మండపం, కోటీ 32 లక్షలతో గొల్లప్రోలు సీతారామ స్వామి ఆలయంలో నిర్మించనున్న ప్రాకార మండపంకు శంకుస్థాపన చేశారు పవన్.