PAWAN: రుషికొండపై జగన్ మాఫియా దందాలు
రుషికొండ భవనాలను పరిశీలించిన పవన్... జనసేన ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలన... ఏటా రూ.15 లక్షల కరెంటు బిల్లు: పవన్... పెచ్చులూడుతున్నాయన్న డిప్యూటీ సీఎం
విశాఖలో రుషికొండ భవనాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో కలసి పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తొలుత రుషికొండ భవనాలు 2 బ్లాకులుగా కట్టడానికి రూ.164 కోట్లు మాత్రమే నిర్దేశించారని చెప్పారు. కానీ, 7 బ్లాక్‌లుగా ప్రణాళిక మార్చి.. 4 బ్లాక్‌లు మాత్రమే నిర్మించారని తెలిపారు. 4 బ్లాక్‌ల నిర్మాణానికే రూ.454 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోందన్నారు. ప్రస్తుతం ఈ భవనాలకు కేవలం కరెంట్ బిల్లు ఏటా రూ.15 లక్షలు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లోపల పెచ్చులు ఉడిపోతున్నాయని, కొన్ని చోట్ల నీరు లీక్ అవుతోందని చెప్పారు. ఈ భవనాలకు పర్యాటక రంగ అభివృద్ధికి ఉపయోగపడేలా ఏం చేయాలో కూటమి ప్రభుత్వం యోచించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రుషికొండ టూరిజం భవనాలు పరిశీలించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. అత్యధునిక బెడ్ రూమ్స్, బాత్ రూమ్స్ చూసి ఆశ్చర్యపోయార.. అవన్ని పాడైపోతున్నాయి.. వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు.. గతంలో హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి ఏడు కోట్లు ఆదాయం వచ్చేదని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. కానీ, ఇప్పుడు మెంటినెన్స్ కు కోటి రూపాయలు బకాయి పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు భారీ ఖర్చు..
గతంలో రుషికొండ మీద రిసార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి 7 కోట్ల వరకు ఆదాయం వచ్చేదని పవన్ తెలిపారు. ప్రస్తుతం సంవత్సరానికి కేవలం కరెంట్ బిల్లులకు 15 లక్షలు ఖర్చు, ఏడాదికి రూ.1.8 కోట్లు వ్యయం అవుతుందన్నారు. మిగతా విషయాలపై ఇంకా మాట్లాడనవసరం లేదని, ఇదివరకే జరగాల్సిన డ్యామేజ్ జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రుషికొండలోని ఈ నిర్మాణాలను టూరిజం కింద ఎలా వినియోగించాలని ఇలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణాన్ని దేనికోసం, ఎలా ఉపయోగించాలి అని ఆలోచన చేస్తున్నామన్నారు.
ఎమ్మెల్యేలకు కీలక సూచన
ఏపీలో కూటమి ఐక్యతే కీలకమని పవన్ కల్యాణ్ మరోసారి పునరుద్ఘాటించారు. లేదంటే అభివృద్ధిలో ముందుకు వెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై చట్టం తీసుకొస్తామని చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సిందేనని హెచ్చరించారు.