151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి వైసీపీ ఏం చేస్తోంది : పవన్ కల్యాణ్
Pawan Kalyan : 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి వైసీపీ ఏం చేస్తోందని నిలదీశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.;
Pawan Kalyan : 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి వైసీపీ ఏం చేస్తోందని నిలదీశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నేను మోదీతో గొడవపెట్టుకోవాలనేది వైసీపీ నాయకుల కోరికలా కనిపిస్తోందని ఫైరయ్యారు.. స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావంగా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో దీక్ష చేపట్టిన జనసేనాని.. దీక్ష ముగిసిన అనంతరం ప్రసంగించారు.. ప్రతిక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక ఇంకో మాట్లాడుతోందని వైసీపీపై నిప్పులు చెరిగారు పవన్ కల్యాణ్. తనకు శాసనం చేసే అధికారం లేదని.. ఆ అధికారం వున్న వాళ్లు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని వైసీపీపై నిప్పులు చెరిగారు పవన్ కల్యాణ్.. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడతాం, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేం పోరాడతామని దమ్ముంటే పార్లమెంట్ వేదికగా ప్లకార్డులు పట్టుకోగలరా అని దీక్షా వేదికగా నిలదీశారు.