డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు ఓ కాంట్రవర్సీని క్రియేట్ చేసేసారు. ఆయన సరదాగా అన్న మాటలను వివాదంగా మార్చేశారు. కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందేమో అన్నట్టు ఆయన నవ్వుతూ చెప్పారు. వాస్తవానికి దాని కంటే ముందు కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి ఉన్న అసలు కారణాలను కూడా బయటపెట్టారు. కానీ అవేవీ మాట్లాడకుండా వారం రోజుల తర్వాత ఇప్పుడు దాన్ని రచ్చ చేస్తున్నారు. తెలంగాణ వాదులు, తెలంగాణ లీడర్లు ఇన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారు. దీనికి జనసేన పార్టీ కూడా వివరణ ఇచ్చింది. ఆయనకు తెలంగాణ మీద అపారమైన ప్రేమ గౌరవం ఉన్నాయని దయచేసి ఆయన మాటలను వక్రీకరించొద్దని కోరింది. అటు జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణను ఎన్నిసార్లు పొగిడారో, వరదలు లాంటివి వచ్చినప్పుడు ఏపీతో సమానంగా తెలంగాణకు సహాయం చేసిన విషయాలను గుర్తుకు చేస్తున్నారు.
ఈ గ్యాప్ లోనే సిపిఐ నారాయణ కూడా ఓ వీడియో రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నాడని అందుకే దిష్టిలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండట్లేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని వెంటనే భర్త రఫ్ చేయాలని ఓ డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై జనసేన నాయకులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అంత పెద్ద నేరం ఏం చేశాడని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఎంతోమంది నేతలు భారీ కుంభకోణాలు చేసి ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చినా సరే వాటి గురించి నారాయణ మాట్లాడట్లేదని చెబుతున్నారు. ఇటు ఏపీలో వైసిపి నేతలు ఇంత పెద్ద అరాచకాలు, తిరుపతి లడ్డును కల్తీ చేయడం లాంటివి చేసినా సరే నారాయణ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ అలాంటి అవినీతి పనులు చేయకుండా తాను సినిమాల్లో సంపాదించిన డబ్బులను ప్రజల కోసం ఖర్చు పెడుతూ.. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా తన జేబులోంచి డబ్బులు సాయం చేస్తున్న వ్యక్తిని బర్త్ రఫ్ చేయాలా అని ప్రశ్నిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఏపీలో ఎన్ని రకాల మంచి పనులు చేశారు జనసైనికులు చెబుతున్నారు. 4500 కిలోమీటర్ల రోడ్లు వేసిన చరిత్ర కేవలం పవన్ కళ్యాణ్ ది మాత్రమే అన్నారు. ఏపీ చరిత్రలోనే ఎన్నడు రోడ్లు వెళ్ళని గ్రామాలకు రోడ్లు వేసిన ఘనత పవన్ దే అన్నారు. కరెంటు సదుపాయాలు లేని గ్రామాలకు ఇప్పుడు వెలుగులు పంచిన చరిత్ర కూడా పవన్ కే సొంతం అంటున్నారు. ఇన్ని రకాల మంచి పనులు చేస్తుంటే వాటన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం రాజకీయంగా పవన్ మీద మాట్లాడితే హైలెట్ అవుతామని కొందరు ఇలా చేస్తున్నారని జన సైనికులు చెబుతున్నారు.