ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ఫ్యామిలీ అరుదైన ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరస్ అవుతోంది. కుమార్తె ఆద్యతో కలసి దిగిన తొలి ఫొటో వెలుగులోకి రావడంతో నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తరువాత తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, కుటుంబ సభ్యులతో కలసి వేడుకలు జరుపుకున్న ఫొటోలు, వీడియోలు జనసైనికులను, మెగా అభిమానులను కనువిందు చేశాయి.
పవన్ సతీమణి అనా లెజినోవా, కుమారుడు అకీర నందన్, కుమార్తె అద్యలతో కలసి దిగిన అరుదైన ఫొటో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 12న రాష్ట్ర మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ కార్యక్రమానికి సతీమణి లెజ్ నోవాతో పాటు కుమారుడు, కుమార్తె కూడా హాజరయ్యారు. రాజకీయ అతిరథ మహారధులు పాల్గొన్న ఆ కార్యక్రమంలో వారికి వేదికపైకి వచ్చే అవకాశం దక్కలేదు. పిల్లలు జనాల్లోనే కిందే ఉండిపోయారు.
ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ కల్యాణ్ ఫ్యామిలీతో కలసి మంగళగిరిలో తాను నివాసముంటున్న పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి పవన్ కల్యాణ్ కొంత సేపు ఫ్యామిలీతో సేద తీరారు. ఆ సమయంలో సతీమణి లేజీనోవా, కుమార్తె ఆద్య, కుమారుడు ఆకీరా నందన్ తో కలసి పవన్ కల్యాణ్ ఆప్యాయంగా దిగిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.