AP : గిరిజన గ్రామాల్లో పవన్ పర్యటన.. జోరందుకున్న అభివృద్ధి పనులు

Update: 2025-08-01 10:00 GMT

అడవితల్లి బాట ప్రోగ్రామ్‌తో మన్యంలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. ఏప్రిల్‌‌లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అల్లూరి జిల్లాలో పర్యటించారు. గిరిజనులతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కురిడి గ్రామాన్ని సందర్శించిన పవన్‌కు స్థానికులు తమ సమస్యలు మొర పెట్టుకున్నారు. స్పందించిన పవన్ వెంటనే సీసీరోడ్లు, పాఠశాలకు ప్రహరీ నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఈ నిధులతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. కురిడి గ్రామంలో సీసీరోడ్లకు రూ. 20 లక్షలు, పాఠశాల ప్రహరీ నిర్మాణానికి రూ.15 లక్షలు కేటాయించారు. ఇక డుంబ్రిగుడ మండలంలో వీధిరోడ్లు, భవన నిర్మాణాలకు నిధులు కేటాయించారు. మారుమూల గ్రామం పొడ్డగుడకు రూ. 1.47 కోట్లతో బీటీరోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. తమ గ్రామాల్లో జోరుగా అభివృద్ధి పనులు జరుగుతుండడం చూసి గిరిజనలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News