Perni Nani : మా ప్రభుత్వం ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు : పేర్ని నాని
Perni Nani : అందర్నీ సంతృప్తి పర్చడం ఎవరికైనా కష్టమే అన్నారు ఏపీ మంత్రి పేర్ని నాని. తమ ప్రభుత్వం ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదన్నారు.;
Perni Nani : అందర్నీ సంతృప్తి పర్చడం ఎవరికైనా కష్టమే అన్నారు ఏపీ మంత్రి పేర్ని నాని. తమ ప్రభుత్వం ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదన్నారు. వర్మతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.చట్ట ప్రకారమే సినిమా టికెట్ రేట్లు నిర్ణయించామన్నారు. చట్టంలోని విషయాలనే వర్మకు చెప్పామన్నారు. రేపు కమిటీ సమావేశం కూడా ఉందని... RGVలాగే ఎవరైనా తనతో చర్చించొచ్చన్నారు పేర్నినాని. అటు మంత్రితో భేటి తర్వాత టికెట్ల రేట్లు తగ్గించడంతో సినిమా పరిశ్రమ దెబ్బతింటుందన్న వర్మ.. త్వరలో మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఐదు అంశాలపై మంత్రితో మాట్లాడానని.. ఐతే థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చ జరగలేదని వర్మ స్పష్టం చేశారు.