Perni Nani Wife Jayasudha : పేర్ని నాని భార్యకు కోర్టులో ఊరట

Update: 2024-12-31 10:00 GMT

మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు బిగ్ రిలీఫ్ లభించింది. రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. కృష్ణాజిల్లా కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులో పోలీస్ విచారణకు సహకరించాలంటూ పేర్ని జయసుధకు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే A2గా ఉన్న గోడౌన్ మేనేజర్ మానస తేజను విచారిస్తున్నారు పోలీసులు. తాజాగా సివిల్ సప్లయిస్ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటి రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యం మాయం వెనుక కోటిరెడ్డి పాత్ర కూడా ఉందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే గోడౌన్ లో బియ్యం మాయం అయ్యాయని ఫిర్యాదు చేసింది కోటి రెడ్డే కావడం విశేషం. 

Tags:    

Similar News