PM Modi : అక్టోబర్ 16న ఏపీకి ప్రధాని మోదీ.. చంద్రబాబు, పవన్ తో కలిసి భారీ రోడ్‌షో
ప్రధాని మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. వచ్చే నెల అక్టోబర్ 16వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారు.
శ్రీశైలం దర్శనం, కర్నూలులో రోడ్‌షో ప్రధాని తొలుత ఆయన శ్రీశైలం క్షేత్రానికి వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం కర్నూలు నగరంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో కలిసి భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు.
ముగ్గురు కూటమి నేతలు కలిసి ఈ భారీ ర్యాలీని చేపట్టనుండగా, ప్రధానంగా జీఎస్టీ సంస్కరణల అంశంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ రోడ్‌షో ద్వారా కూటమి బలాన్ని మరోసారి చాటుకోవాలని నేతలు భావిస్తున్నారు.
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు ప్రధాని మోదీ తన పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఈ వివరాలను మంత్రి నారా లోకేశ్ శాసనమండలి లాబీలో ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ ప్రస్తావించినట్లు సమాచారం.