Polavaram: పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కుంటి సాకులు చెబుతున్న జగన్‌ సర్కార్‌

Polavaram: పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి జగన్‌ సర్కార్‌ నానా తిప్పలు పడుతోంది.

Update: 2023-04-03 09:00 GMT

Polavaram: పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి జగన్‌ సర్కార్‌ నానా తిప్పలు పడుతోంది. గత నాలుగేళ్లుగా పనులు చేయలేక అనేక ఇబ్బందులు పడుతోంది. అయితే అసలు వాస్తవాలను పక్కదోవ పట్టించేందుకు మార్గాలను ఎతుకుతోందన్న విమర్శలు వస్తున్నాయి.అధికారులు చేప్పే లెక్కలు కూడా తప్పులతడక ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ నివేదికలనూ కాదని,వారు చెప్పిన విషయాలనూ పరిగణనలోకి తీసుకోకుండా వింత వాదనలు వినిపిస్తోందని అంటున్నారు జల రంగ నిపుణులు.

2022 మార్చి నుంచి 2023 ఫిబ్రవరి నెలాఖరు వరకు పోలవరంలో 3శాతం లోపు పనులే జరిగాయని డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ సమావేశంలో లెక్కలు తేల్చారు. గత మార్చి 4,5 తేదీల్లో జరిగిన సమావేశంలో.. ఏడాది కాలంలో జరిగిన పనులను పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈ వివరించారు. సమావేశం మినిట్స్‌లో క్లారిటీ ఇచ్చారు. 2022 నాటికి పోలవరంలో 45 శాతం పనులు జరిగితే 2023 ఫిబ్రవరి 25 నాటికి 48 పనులు జరిగినట్లు ఎస్‌ఈ తెలపడమే ఇందుకు సాక్ష్యం. మరోవైపు గత ప్రభుత్వ అవినీతి, అనాలోచిత విధానాలతోనే ప్రధాన డ్యాం దగ్గర ఏర్పడ్డ అగాధాలు, డయాఫ్రం వాల్‌ దెబ్బతినడం వల్లే పోలవరంలో పనులు ఆలస్యమవుతున్నాయని ఫ్యాక్ట్‌ చెక్‌లో తెలిపారు అయితే పోలవరం నార్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని జగన్ సర్కారే కేంద్ర సర్కార్‌కు నివేదిక ఇచ్చింది. పోలవరంలో అన్ని నిర్ణయాలు ఆథారిటీ ఆధీనంలోనే, వారి అనుమతితోనే జరిగాయని ప్రభుత్వమే చెబుతోంది. అయితే సర్కార్‌ వైఫల్యంతో ఏంచేయాలో తెలియక ఇలాంటి అబద్ధాలను ఫ్యాక్ట్‌చెక్‌లుగా ప్రచారం చేస్తోందన్న విమర్శుల వస్తున్నాయి.

పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కుంటి సాకులు చెబుతున్న జగన్‌ సర్కార్‌ ఈ నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో అలసత్వాన్ని అనేక సందర్భాల్లో బయటపడింది.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి ఏపీ ప్రభుత్వమే కారణమని 2022 ఆగస్టులో పోలవరం అథారిటీ లేఖ రాసింది. దిగువ కాఫర్‌ డ్యాంను సకాలంలో పూర్తి చేయలేకపోయారని తప్పుపట్టింది. దీనివల్ల వరద ముంచెత్తిందని, ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట నీరు చేరిపోయిందనీ తప్పుపట్టింది.డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి ప్రకృతి వైపరీత్యాలు కారణం కాదు.మానవ వైఫల్యమే కారణం.ఎగువ కాఫర్‌ డ్యాంలో నీరు దిగువకు వెళ్లేందుకు వదిలిన రెండు గ్యాప్‌లను సరైన సమయంలో పూడ్చకపోవడం వల్లే ఈ విధ్వంసం జరిగిందని ఐఐటీ నివేదిక కమిటీ చెప్పింది. మరి ఆ గ్యాప్‌లు పూడ్చాల్సిన బాధ్యత జగన్‌ సర్కార్‌కు లేదా అన్న ప్రశ్న తలెత్తుతుంది.ఇక కాంట్రాక్టరును మార్చడాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ తప్పుపట్టింది. అప్పట్లో కొత్తగా టెండర్లు పిలవడం కూడా సరికాదని,దీనిపై వివరణ ఇవ్వాలని పోలవరం అథారిటీ లేఖ రాసింది.ఇలాంటి వాస్తవాలను పక్కనపెట్టి ఫ్యాక్ట్ చెక్‌ పేరుతో వింత వాదనలు చేస్తుందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.  

Tags:    

Similar News