పోలవరం పోరుకేక..
పోలవరం నిర్వాసితులతో కలిసి సీపీయం నేతలు 14 రోజులు పాటు 400 కిలోమీటర్ల మహాపాదయాత్ర చేపట్టారు.;
అల్లూరు సీతారామరాజు జిల్లాలో పోలవరం పోరుకేక కార్యక్రమాన్ని నిర్వహించారు సీపీఎం నేతలు. పోలవరం నిర్వాసితులతో కలిసి సీపీయం నేతలు 14 రోజులు పాటు 400 కిలోమీటర్ల మహాపాదయాత్ర చేపట్టారు. జూలై 4వ తేదీని విజయవాడలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు సీపీఎం నేతలు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని చెప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులకు మోసం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేయాలన్నారు. పరిహారం పూర్తిగా ఇచ్చేవరకు ప్రాజెక్ట్ నిర్మాణం ఆపాలని డిమాండ్ చేశారు.