Pattabhi Ram: పట్టాభిరామ్ ఇంటిపై దాడి కేసులో పలువురు అరెస్ట్..
Pattabhi Ram: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై దాడి వ్యవహారంలో 11 మందిపై కేసు నమోదైంది.;
Pattabhi Ram (tv5news.in)
Pattabhi Ram: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై దాడి వ్యవహారంలో 11 మందిపై కేసు నమోదైంది. నిందితులను విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. బావాజీపేటకు చెందిన బచ్చు మాధవి, ఉడ్‌పేటకు చెందిన ఇందుపల్లి సుభాషిణి, గుణదలకు చెందిన తంగం ఝాన్సీరాణీ, సునీతతోపాటు సీతారాంపురానికి చెందిన గూడవల్లి భారతిపై కేసు నమోదైంది. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు కీస్తురాజపురానికి ఐదుగురు నిందితులు యల్లాటి కార్తీక్, ప్రభుకుమార్, వినుకొండి అవినాష్, అశోక్‌కుమార్‌తోపాటు రాజ్‌కుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.