ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి సంబురాల్లో ప్రజలు మునిగిపోయారు. మూడు రోజుల పాటు వైభవంగా పండుగ జరుపుకుంటున్నారు. ప్రతి పల్లెటూరు పండగ వైభవంతో వెలిగిపోతోంది. ప్రభుత్వం సంక్రాంతి ఏర్పాట్లను భారీగా చేసింది. ఆయా ప్రాంతాల్లో ఉండే ఉండే సంప్రదాయాల పరంగా పండుగను జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ మాత్రం పండగ పూట రాజకీయాలు చేస్తోంది. రాష్ట్రమంతా పండుగ జరుపుకుంటే వైసీపీ వాళ్లు ఇక్కడ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మాజీ మంత్రి రోజా మొన్న గుంటూరుకు వెళ్లారు. అక్కడ కోళ్ల పందేలాను చూశారు. పండగును సెలబ్రేట్ చేసుకున్న ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలెవరూ పండుగను జరుపుకోవట్లేదని అంటున్నారు. ఏ ఒక్కరూ సంతోషంగా లేరని చెబుతున్నారు.
అదే సమయంలో మాజీ మంత్రి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి పాలనలో యువత, మహిళలు, నిరుపేదలు, కార్మికులు ఎవరూ కూడా సంతోషంగా లేరని.. పండుగకు వారంతా దూరంగా ఉంటున్నారని ఓ కట్టుకథ అల్లేశారు. కానీ ప్రజలెవరూ సంతోషంగా పండుగ జరుపుకోకపోతే.. ఈ వైసీపీ నేతలు ఎలా జరుపుకుంటున్నారు అనేది ఇక్కడ పాయింట్. వాస్తవానికి ఏపీ వ్యాప్తంగా ప్రజలంతా సంతోషంగా పండుగను జరుపుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందుతుంది కాబట్టి వారు సంతోషంగానే ఉన్నారు.
కానీ వైసీపీ నేతలు మాత్రం ఓర్వలేక ఇలాంటి కామెంట్లతో చిచ్చు రాజేయాలని చూస్తున్నారు. మామూలు రోజుల్లో ఎలాగూ కూటమి మీద బురదజల్లడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకుంటారు అది అందరికీ తెలిసిందే. కానీ సంక్రాంతి పండుగ నాడు కూడా ఈ విధమైన రాజకీయాలు ఏంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు ప్రజలు. వైసీపీ నేతలు ఏపీలో ఏం జరిగినా దాన్ని కూటమి మీద బురదజల్లడానికే వాడుకుంటారా అని మండిపడుతున్నారు.