Prakash Raj: చంద్రబాబు ఘటనలో ఎన్‌టీఆర్ వీడియోపై ప్రకాశ్ రాజ్ స్పందన..
Prakash Raj: చంద్రబాబుకు జరిగిన అవమానంపై తాజాగా ఎన్‌టీఆర్ తన ట్విటర్ ద్వారా స్పందించారు.;
Prakash Raj: చంద్రబాబుకు జరిగిన అవమానంపై తాజాగా ఎన్‌టీఆర్ తన ట్విటర్ ద్వారా స్పందించారు. అయితే ఎన్‌టీఆర్ అలా స్పందించడాన్ని.. ట్విటర్ వీడియోలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. 'వెల్ సెడ్ డియర్' అంటూ తారక్ ట్విటర్ వీడియోను రీట్వీట్ చేసి క్యాప్షన్ పెట్టారు. చంద్రబాబు కుటుంబానికి జరిగిన అవమానంపై ప్రకాశ్ రాజ్ నేరుగా స్పందించకపోయినా తారక్ వీడియోను రీట్వీట్ చేయడం ద్వారా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు.
రాజకీయాలపై ప్రకాశ్ రాజ్ నేరుగానే స్పందిస్తుంటారు. ఈమధ్యే జరిగిన 'మా' ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా తనపై విమర్శలకు దీటుగానే జవాబిచ్చారు. ఇక ఆ ఎన్నికల ప్రచారం సందర్భంలో తనకు ఏపీ రాజకీయాలపై అంతగా అవగాహన లేదని చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న మార్పులపై డైరెక్ట్ గా మాట్లాడకపోయినా... జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసిన వీడియోపై కామెంట్ ద్వారా మనసులో మాటను బయటపెట్టారు.
ప్రకాశ్ రాజ్‌తో పాటు చాలామంది ప్రముఖులు చంద్రబాబు కుటుంబానికి జరిగిన అవమానంపై ఇప్పటికే స్పందించారు. ఎన్‌టీఆర్ కుటుంబం అంతా ఒకే చోట చేరి వైసీపీ సభ్యుల దూషణలను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై ఎన్‌టీఆర్ కుటుంబమంతా ఏకతాటిపై ఉందని అభిమానులకు సందేశాన్ని పంపించినట్లయ్యింది.
Well said dear @tarak9999 … 🙏🏻🙏🏻🙏🏻 .. https://t.co/QLsSBuzqQ0
— Prakash Raj (@prakashraaj) November 20, 2021