అప్పుడు చంద్రబాబును కలవడంపై ఇప్పుడు మాట్లాడిన ప్రశాంత్ కిషోర్

Update: 2024-01-23 06:52 GMT

ప్రశాంత్ కిషోర్(prashant kishore) ఈపేరు తెలియని వారు లేరు తెలుగురాష్ట్రాల్లో. నెల రోజుల క్రితం టీడీపీ(TDP) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో(chandra babu naidu) ఐ పాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన చంద్రబాబును కలిశారు. చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై పలు ఊహాగానాలు వచ్చాయి. చంద్రబాబు తరపున ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారని వార్తలు వెల్లువెత్తాయి.. అయితే, దీనిపై చంద్రబాబు కానీ, టీడీపీ కానీ స్పందించలేదు. అలాగే చంద్రబాబుతో భేటీ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. పీకే మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. ఇప్పుడు అయన చంద్రబాబుతో అప్పటి భేటీపై వివరణ ఇచ్చారు. తాను విజయవాడ వెళ్లడానికి గల కారణాలను వెల్లడించారు. విజయవాడ(Vijayawada) వెళ్లి చంద్రబాబును కలవడం వెనుక ఏం జరిగిందో చెప్పారు.

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకే తాను విజయవాడ వెళ్లానని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. నేను చంద్రబాబు నాయుడుని కలవడానికే వెళ్లాననడంలో సందేహం లేదు. తనకు అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్ నేత చంద్రబాబును కలవాలని అడిగినందుకే తాను విజయవాడకు వెళ్లానని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసే అంశం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని, చంద్రబాబును కలవాలని తన స్నేహితుడు కోరడంతో తాను విజయవాడ వెళ్లానని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

ఏపీలో తాను ఎవరి కోసం పని చేయనని, ఇప్పుడు ఏపీ రాజకీయాలతో( AP Politics ) తనకు సంబంధం లేదని తన స్నేహితుడితో స్పష్టం చేసినట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

Tags:    

Similar News