రాజధాని అమరావతి పున:ప్రారంభ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ వచ్చే నెల 15-20 తేదీల మధ్య రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. మోదీ పర్యటన ఖరారైనా పీఎంవో తేదీని ఫిక్స్ చేయలేదు. అయినప్పటికీ ప్రభుత్వం బహిరంగ సభ కోసం 250 ఎకరాల్లో సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందుకోసం వెలగపూడి సచివాలయం వెనుక ఎన్-9 రోడ్డు సమీపాన ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 30న ఇక్కడే ఉగాది ఉత్సవాలు నిర్వహించనుంది. ప్రధాని సభను కూడా ఇక్కడే ఏర్పాట్లు చేసే ఉద్దేశంతో విస్తీర్ణాన్ని 250 ఎకరాలకు పెంచి ఇప్పటి నుంచే సంబంధిత పనులు మొదలుపెట్టారు. ఇంకోవైపు.. తమకు మేలు చేకూర్చే విధంగా రాజధానిపై ప్రధాని మరిన్ని వరాలు ప్రకటిస్తారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.