ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని కొనియాడారు. ఈ మేరకు మోదీ తమ ‘ఎక్స్’ ఖాతాలో పవన్ కల్యాణ్‌ను అభినందిస్తూ పోస్ట్ చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనపై అద్భుతంగా దృష్టి సారిస్తూ, ఎన్డీయే కూటమిని బలోపేతం చేస్తున్న పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నేను ఆకాంక్షిస్తున్నాను" అని మోదీ తెలిపారు. ప్రధాని మోదీ శుభాకాంక్షలు జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. రాష్ట్ర రాజకీయాల్లో, ఎన్డీయే కూటమిలో పవన్ కల్యాణ్ ప్రాముఖ్యతను ఈ శుభాకాంక్షలు మరింత చాటి చెప్పాయి.