ఏపీ దివంగత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారసుల మధ్య ఆస్తివివాదాలు ముదిరాయి. ఆస్తి వివాదంలో చెల్లెలు షర్మిలపై ఏపీ మాజీ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. కొన్నాళ్లుగా దూరం దూరంగా ఉంటున్న అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తన తల్లికి ఇచ్చిన షేర్లను చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకుంటున్నారని పిటిషన్ వేశారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLTలో తల్లి, షర్మిలపై జగన్ దంపతులు పిటిషన్ వేశారు. ఈ ఆరోపణలను షర్మిల వర్గం తిప్పికొడుతోంది. కోర్టులోనే నిజం తేలుతుందని అంటున్నారు.