AP : సీఎం చంద్రబాబును కలిసిన పులివెందుల జడ్పీటీసీ విజేత లతారెడ్డి

Update: 2025-08-21 14:00 GMT

ఇటీవలే జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. కూటమి పార్టీ బలపరిచిన టీడీపీ అభ్యర్థులు ఈ రెండు స్థానాలలో ఘన విజయం సాధించారు. కాగా గెలిచిన అభ్యర్థులు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. పులివెందుల నుండి గెలిచిన బీటెక్ రవి భార్య లతారెడ్డి, ఒంటిమిట్ట నుంచి గెలిచిన ముద్దు కృష్ణారెడ్డి ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబు ను కలిశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం... ఇది ప్రజాస్వామ్య విజయమని అభివర్ణించారు. గెలిచిన అభర్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నేతలంతా సమష్టిగా కృషి చేయడం, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకు సాగడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రశంసించారు. పార్టీ శ్రేణుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని అన్నారు. ఈ గెలుపుతో వచ్చిన స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా పలువురు కడప జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు సీఎం ను కలిసిన వారిలో ఉన్నారు.

Tags:    

Similar News