ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ 5వ స్థానానికి వచ్చిందని, రాబోయే ఐదేళ్లలో 3వ స్థానానికి చేరుకుంటుందన్నారు రాజమండ్రి ఎంపీ, బీజేపీ స్టేట్ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం, దేశంలో అభివృద్ధి సాధిస్తామన్నారు. సంక్షేమం, దేశాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు.
మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3లక్షల కోట్లను కేటాయించిందని తెలిపారు. రాజమండ్రిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మంచి ప్యాకేజీతో వరద బాధితులను రాష్ట్రం ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు.