Vijayawada: విజయవాడ దుర్గ గుడిలో రచ్చరచ్చ చేసిన రామ్‌చరణ్ అభిమానులు..
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి నామాలు వినిపించాల్సిన చోట జైచరణ్ అంటూ నినాదాలు చేశారు రామ్‌చరణ్ అభిమానులు.;
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి నామాలు వినిపించాల్సిన చోట జైచరణ్ అంటూ నినాదాలు చేశారు రామ్‌చరణ్ అభిమానులు. దుర్గ గుడి అంతరాలయంలోనూ అభిమానులు జైచరణ్ అంటూ అరిచారు. అమ్మవారిని బదులు మరొకరిని స్తుతిస్తూ నినాదాలు చేయడం అపచారమేనంటున్నారు భక్తులు. మరోవైపు ఆలయంలో వీడియోలు తీశారు. పోలీసులు, దుర్గ గుడి అధికారుల సమన్వయ లోపం కారణంగా గందరగోళం ఏర్పడింది. క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. ఆలయం లోపల రైలింగ్ రాడ్లు విరిగిపోయాయి. దీనిపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.