ఏపీలో నేతలపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసుల విచారణకు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ హాజరు కాలేదు. గత వారం రామ్ గోపాల్ వర్మపై ఐటీ చట్టం కింద కేసు నమోదు అయింది. అయితే ఈ కేసుపై నేడు విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తాను రాలేనని పోలీసులకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. నాలుగు రోజులు గడువు ఇవ్వాలని వాట్సాప్ ద్వారా అధికారులను కోరారు. తనపై నమోదైన కేసుకు సంబంధించి పోలీసులకు సహకరిస్తానని చెప్పిన ఆర్జీవీ.. తన వ్యక్తిగత పనుల కోసం నాలుగు రోజుల సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. అనంతరం తాను తప్పుకుండా విచారణకు హాజరవుతానని చెప్పినట్లు సమాచారం.