తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ..!
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పేరు ఖరారైంది. ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్న కమలనాథులు... చివరికి రత్నప్రభ వైపు మొగ్గు చూపారు.;
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పేరు ఖరారైంది. కొద్ది రోజులుగా అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్న కమలనాథులు... చివరికి రత్నప్రభ వైపు మొగ్గు చూపారు. ఈ విషయాన్ని కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రత్నప్రభ 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా కర్నాటక కేడర్‌కు ఎంపికయ్యారు. కర్నాటకలో అనేక కీలక పదవులు నిర్వహించిన ఆమె.. డిప్యుటేషన్‌పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ సేవలు అందించారు. కర్నాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైరయ్యారు. 2018 లో ఆమె బీజేపీలో చేరారు.