AP Liquor Scam Case : మద్యం కుంభకోణం కేసులో విచారణకు కు రాలేనన్న రిటైర్డ్ అధికారి

Update: 2025-07-12 06:15 GMT

ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు అధికారులను విచారించిన సిట్ కొందరిని అరెస్ట్ చేసింది. గత వైసిపి ప్రభుత్వం హయాంలో మద్యం సేకరణ, పంపిణీ, ధరల నిర్ణయంలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ అధికారి డాక్టర్ రజత్ భార్గవ కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కాగా నేడు విచారణకు రావాలని సిట్ అధికారులు తమ నోటీసులో స్పష్టం చేసారు. అయితే, నేటి విచారణకు డాక్టర్ రజత్ భార్గవ హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని ఆయన సిట్ అధికారులకు తెలియజేశారు. శుక్రవారం విచారణకు రాలేనని, వచ్చే వారం హాజరవుతానని అధికారులకు సమాచారం ఇచ్చారు. తన ఆరోగ్యం బాగోలేదని, చికిత్స పొందుతున్నానని, విచారణకు హాజరయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. అయితే, సిట్ అధికార వర్గాలు మాత్రం ఆయన విచారణకు హాజరవుతారని భావిస్తున్నాయి.

Tags:    

Similar News