Road Accident : స్కూల్ కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే..

Update: 2025-07-08 09:45 GMT

పిల్లలను స్కూల్ కి తీసుకెళ్తున్న ఓ తండ్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఇద్దరు పిల్లలను స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళుతుండగా లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో ఒక కొడుకును కోల్పోగా తండ్రి ,మరో కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలి వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదం అందరిని కలిచి వేసింది.

వివరాల ప్రకారం పామర్రు మండలం బల్లిపర్రు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను బైక్ పై స్కూల్ కి తీసుకెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి జోయల్(15) అక్కడికక్కడే మృతి చెందగా... సోదరుడు అభి, తండ్రికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం తో ఘటనా స్థలాన్ని కి చేరుకున్న పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో బల్లిపర్రు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News