రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్

Ruia Hospital Incident: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా అందకపోవడం కారణంగానే 23 మంది చనిపోయారని ఏపీ ప్రభుత్వం అంగీకరించింది.

Update: 2021-08-07 08:12 GMT

AP High Court: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా అందకపోవడం కారణంగానే 23 మంది చనిపోయారని ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు రుయా ఘటనపై ఏపీ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆక్సిజన్ సరఫరా చేసే కాంట్రాక్టర్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని.. ఇప్పటికే మృతులకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇచ్చామన్న ప్రభుత్వం తెలిపింది. ఆక్సిజన్‌ అయిపోయిందని తెలిసినా కాంట్రాక్టర్‌ సరఫరా చేయలేదన్న ప్రభుత్వం.. కాంట్రాక్టర్‌పై ఐపీసీ 304 కింద కేసు నమోదు చేశామని అఫిడవిట్‌లో పేర్కొంది. భారత్‌ ఫార్మా మెడికల్‌ ఆక్సిజన్ సప్లై లిమిటెడ్‌ కంపెనీపై కేసులు నమోదు చేశామని తెలిపింది.

Tags:    

Similar News