జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) సాధించిన విజయంపై ఆయన కుటుంబం అంతులేని ఆనందాన్ని పంచుకుంటోంది. పవన్ కల్యాణ్ వదిన సురేఖ ఖరీదైన మౌంట్ బ్లాక్ పెన్ను బహూకరించింది. పవన్ మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ ఓ గిఫ్ట్ ను అందించారు.
పిఠాపురంలో పవన్ విజయాన్ని కోరుతూ తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న సాయి ధరమ్ తేజ్ ఆ మొక్కును తీర్చుకున్నారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్న సాయిధరమ్ తేజ్ గిఫ్ట్ ను అందిస్తూ పవన్ తో కలసి ఆప్యాయంగా దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
“ నా చిన్నతనంలో తొలిసారి నాకు స్టార్ వార్ లెగో పరిచయం చేసింది మావయ్యే. ఆయనలోని పిల్లాడికి దాన్ని గిఫ్ట్ గా ఇచ్చే అవకాశం ఇప్పటికి దక్కింది" అని పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. పవన్ కల్యాణ్ వదిన ఇచ్చిన గిప్ట్ పెన్ను ఖరీదు రూ.2.5లక్షలు ఉండొచ్చని.. సాయిధరమ్ తేజ్ ఇచ్చిన గిఫ్ట్ ఖరీదు రూ.లక్షన్నర ఉండొచ్చని చెబుతున్నారు.