వైసీపీ నేత, జగన్ సన్నిహితుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ భార్గవరెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అత్యవసరంగా పిటిషన్ వేశారు. సజ్జల, అతని కుమారుడు ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే చంద్రబాబు, పవన్‌కల్యాణ్, వారి కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశానని పోసాని వాంగ్మూలం ఇచ్చారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు నమోదుచేసిన కేసులో తమను అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉందని, ముందస్తు బెయిల్ మంజూరుచేయాలని కోరారు. తమను అమాయకులమని... తమను అనవసరంగా ఈ కేసులోకి లాగుతున్నారని వీరు కోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. కస్టడీలో పోసాని చెప్పిన వివరాలు మినహా, తమకు ఈ నేరంలో పాత్ర ఉందనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని కూడా పేర్కొన్నారు. అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరవుతామని... ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు మంజూరు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.