Sameer Sharma : ఏపీ నూతన సీఎస్‌గా సమీర్‌ శర్మ...!

ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రధాన కార్యదర్శిగా సమీర్‌ శర్మను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.;

Update: 2021-09-10 07:15 GMT

ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రధాన కార్యదర్శిగా సమీర్‌ శర్మను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అక్టోబర్‌ 1న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. సమీర్‌ శర్మ 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లీడర్‌షిప్‌ గవర్నెన్స్‌ సంస్థ వైస్‌ ఛైర్మన్, సభ్య కార్యదర్శిగా ఉన్నారు.

Tags:    

Similar News