ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నట్టు చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో జనాభా లెక్కలు పూర్తయ్యాక, ఎస్సీ వర్గీకరణ చేస్తామని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. అయినప్పటికీ అసమానతలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలని తెలియజేశారు.అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా ఈ వాఖ్యలు చేశారు సీఎం. కులవివక్షపై యుద్ధం చేసిన పార్టీ టీడీపీ అని, ఎన్టీఆర్ కాలం నుంచే సామాజిక న్యాయం కోసం తమ పార్టీ పనిచేసిందన్నారు చంద్రబాబు.