School Bus Accident : ఏపీలో స్కూల్ బస్సుకు ప్రమాదం.. స్టీరింగ్ రాడ్ విరిగి...
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలో స్కూల్ బస్సు ప్రమాదం జరిగింది. పెద్దకామనపూడిలో స్టీరింగ్ రాడ్ విరగడంతో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. స్థానికులు వెంటనే స్పందించి బస్సు అద్దాలు పగలగొట్టి విద్యార్థులను రక్షించారు. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదన సమయంలో బస్సులో 27 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు లేదని వైద్యుల తెలపడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.