బిగ్ బ్రేకింగ్.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో పిటిషన్
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి హైకోర్టుకెళ్లారు.;
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి హైకోర్టుకెళ్లారు. తాను గవర్నర్‌తో జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ బయటకు లీక్ అవుతున్న విషయమై విచారణ జరపాలని పిటిషన్ వేశారు.
ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. తాను గవర్నర్‌కు రాస్తున్న ఉత్తరాలు ప్రివిలైజ్ లెటర్స్ కాబట్టి అవి పబ్లిక్‌కు చేరాల్సినవి కావని అన్నారు. కాని, అలాంటి ఉత్తరాలు గవర్నర్ ఆఫీసు నుంచి ఎలా బయటకు వస్తున్నాయో విచారణ జరపాలని నిమ్మగడ్డ కోరారు.
తాను సెలవు పెడుతున్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయని, గవర్నర్‌కు రాసిన లెటర్స్ సోషల్ మీడియాలో చూశామని మంత్రులు అంటున్నారని, అది ఎలా సాధ్యమో విచారించాలని పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌లో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎస్, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది.