Nara Lokesh : కంపెనీలతో వరుస మీటింగులు.. లోకేష్ టూర్ సక్సెస్

Update: 2025-10-25 16:07 GMT

ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఎంత కృషి చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ ను విశాఖకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అవే పెట్టుబడుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన లోకేష్.. తన టూర్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆరు రోజుల పాటు ఆస్ట్రేలియాలో వరుసగా పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు. క్షణం కూడా వేస్ట్ చేయకుండా సక్సెస్ ఫుల్ గా తన టూర్ ను ఉపయోగించుకున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో వారందరికీ వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను కూడా వివరించారు లోకేష్.

మెల్ బోర్న్, కాన్ బెర్రా, సిడ్నీ లాంటి ప్రముఖ నగరాలలో పలు కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ మీటింగ్స్ లో పాల్గొన్నారు లోకేష్. విశాఖ సీఏఏ పారిశ్రామిక సదస్సుకు వారందరినీ ఆహ్వానించారు. కీలకమైన భూపా సీఈవో బిసెల్స్ స్పాల్ తో లోకేష్ భేటీ అయి.. విశాఖలో జీసీసీ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఏపీలో హెరిటేజ్ టూరిజంను డెవలప్ చేయడానికి సహకారం అందించాలని కోరారు. విక్టోరియా టూరిజం శాఖ మంత్రి డిమో పాలస్ తోనూ సమావేశం అయ్యారు. ఉమ్మడి స్టేడియాలను, ఫ్రెండ్లీ మ్యాచ్ లను నిర్వహించేందుకు సహకారం కోరారు. వీరితో పాటు అనేక రౌండ్ టేబుల్ మీటింగ్స్ లో టెక్నాలజీ విషయంలో ఏపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వివరించారు లోకేష్.

సీఎం చంద్రబాబు నాయుడు విజనరీ నిర్ణయాలతో ఏపీకి గూగుల్ డేటా సెంటర్ వచ్చినట్టు వారికి వివరించారు. 13 నెలల పాటు శ్రమించిన తర్వాత గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని.. దాని వల్ల ప్రపంచ డేటా రంగం విశాఖతోనే ముడిపడుతుందని వివరించారు. ఇప్పటి వరకు ఏపీలో వచ్చిన కంపెనీలు, రాబోతున్న కంపెనీల గురించి వివరించారు మంత్రి నారా లోకేష్‌. విశాఖలో జరిగే బిజినెస్ సమ్మిట్ కు కంపెనీల ప్రతినిధులను ఆహ్వానించి ఏపీలో కంపెనీల కోసం ఉన్న వసతులను తెలుసుకోవాలంటూ కోరారు. ఇలా ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు అలుపన్నది లేకుండా శ్రమించి సక్సెస్ ఫుల్ గా టూర్ ను కంప్లీట్ చేసుకున్నారు లోకేష్.


Full View

Tags:    

Similar News