ఏపీ సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీం కోర్టు ఎత్తి చూపిందని వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ పై నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు కమిటీ వేసిన నేపథ్యంలో జగన్ స్పందించారు. చంద్రబాబు తప్పు చేశారన్నది రుజువైందన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. చంద్రబాబు వేసిన సిట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని జగన్ తెలిపారు. తిరుమలను చంద్రబాబు అపవిత్రం చేశారని మండిపడ్డారు. బాబుకు దేవుడంటే భయం, భక్తి లేవన్నారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి విషయంలో ఎవరైనా ఆడుకుంటే మామూలుగా వుండదని ఆయన హెచ్చరించారు.