Andhra Pradesh : ఏపీలో మహిళల రక్షణకు 'శక్తి' యాప్

Update: 2025-03-05 11:15 GMT

మహిళల రక్షణ కోసం శక్తి యాప్ను అందులోకి తెస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. పని చేసే ప్రదేశాల లో మహిళలపై లైంగిక వేధింపుల గురించి వైసీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు హోం మంత్రి సమాధానమిస్తూ మహిళ రక్షణకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈనెల 8న మహిళా దినోత్సవం సం దర్భంగా సీఎం చంద్రబాబు శక్తి యాప్ను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. నెట్వర్క్ లేని ప్రాంతాల్లో సైతం ఈ యాప్ పనిచేసే విధంగా రూపకల్పన చేసినట్లు మంత్రి చెప్పారు. పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం 2013 పీఓ ఎస్చ్ చట్టం అమలు చేస్తున్నట్లు చెప్పారు. మహిళల రక్షణే ధ్యేయంగా ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసే వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News