SP V. Vidyasagar Naidu : రాయచోటి రెండు వర్గాల మధ్య ఘర్షణపై ఎస్పీ కీలక ప్రకటన
అన్నమయ్య జిల్లా రాయచోటిలో హిందువులు, ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఒక వర్గం తర్వాత మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులను కలిశారన్నారు. కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని వదిలిపెట్టేది లేదని..తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్.