AP : రూ.2.35 కోట్ల కరెన్సీతో గణనాథుడికి ప్రత్యేక అలంకరణ

Update: 2025-08-30 09:15 GMT

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేశ వ్యాప్తంగా కొలువైన గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. పలువురు తమ అభిరుచికి తగినట్లుగా ఏర్పాటు చేసిన మండపాలతో పాటు విభిన్న రూపాల్లో గణపతులను పూజిస్తున్నారు. ఈ కోవలోనే గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన పార్వతీ పుత్రుడు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజారులోని కస్తూరి కంగన్ హాల్ ఎదుట ఆర్యవైశ్య ప్రముఖులు సంకా బాలాజీ గుప్తా బ్రదర్స్ ఆధ్వర్యంలో వ్యాపార ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘాలు, మహిళా సంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. గణపతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారిని రూ.2.35 కోట్ల కరెన్సీతో ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో భక్తులు గణనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

Tags:    

Similar News