Srisailam Reservoir : నిండుకుండలా శ్రీశైలం జలాశయం...10 గేట్లు ఎత్తి నీటి విడుదల...

Update: 2025-09-30 07:00 GMT

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీనికి తోడు తుంగభద్ర నది కూడా భారీగా ప్రవహిస్తుండటంతో, శ్రీశైలం రిజర్వాయర్‌కు ఊహించని స్థాయిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రిజర్వాయర్‌లోని 10 గేట్లను 26 అడుగుల పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న జూరాల సహా ఇతర ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి ఏకంగా 5,34,281 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో మొత్తం 10 గేట్లతో పాటు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా మొత్తం 6,42,626 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Tags:    

Similar News