Ongole Attack: జగన్ బర్త్‌డే వేడుకల్లో సుబ్బారావు గుప్తా.. దాడి కేసు ఏమైనట్టు..?
Ongole Attack: ఒంగోలుకు చెందిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై దాడి సంచలనంగా మారినా.. ఇంత వరకూ నిందితుల అరెస్టు జరగలేదు;
Ongole Attack: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై దాడి సంచలనంగా మారినా.. ఇంత వరకూ నిందితుల అరెస్టు జరగలేదు. కేసులైతే నమోదు చేశారు కానీ.. వాళ్లను అదుపులోకి తీసుకోలేదు. అటు, దాడి దృశ్యాలు వైరల్‌గా మారడంతో రాత్రికి రాత్రే సమీకరణాలు కూడా మారిపోయాయి. ఎలా కాంప్రమైజ్ చేశారో కానీ.. ఇవాళ జగన్ బర్త్‌డే వేడుకల్లో మంత్రి బాలినేని పక్కనే కనిపించారు సుబ్బారావు గుప్తా. జై జగన్, జై బాలినేని అంటూ, తానూ పార్టీ వాడినేననే అనే విశ్వాసం చాటుకున్నారు.
అటు, జరిగిన దాడి తనను తీవ్రంగా బాధించింది అంటూనే కొన్ని విషయాలు చెప్పలేక మౌనంగా ఉండిపోయారు సుబ్బారావు. ఆయన భార్య అయితే జరిగిన దాడిని తట్టుకోలేకపోతోంది. కనీసం వాళ్లను అరెస్ట్ చేసి, తమకు క్షమాపణైనా చెప్పించాలని కన్నీటితో వేడుకుంటోంది. ఏదైనా కేస్‌ను సీరియస్‌గా తీసుకుంటే పక్క రాష్ట్రాలకైనా ఆఘమేఘాలపై వెళ్లి అరెస్టులు చేసే పోలీసులు.. ఈ ఆడపడుచు విన్నపంపై ఎలా స్పందిస్తారో చూడాలి.