తుంగభద్ర డ్యామ్ ఆయకట్టు రైతులకు శుభవార్త. డ్యాంలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ గేటుకు బదులుగా తాత్కాలిక గేట్ ను విజయవంతంగా అమర్చారు. ఈ పనులు రాత్రి పూర్తి అయ్యాయి.
లక్షకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వెళ్తున్న టైంలోనూ ఇరిగేషన్ టెక్నిక్ తో ఈ పని పూర్తిచేశారు. వరద ప్రవాహన ఉధ్ధృతిని తట్టుకుని 30 టన్నుల బరువున్న తాత్కాలిక గేట్ ను సాహసోపేరితంగా అమర్చారు.
దీనికోసం ఇటు ఏపీ, అటు సెంట్రల్ ఇరిగేషన్ అధికారుల టీమ్.. స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. వరద ఉన్నప్పుడు బ్యారేజ్ గేటును అమర్చే పద్ధతిని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసింది. దీంతో 3 రాష్ట్రాల ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.