Andhra Pradesh: దేవాలయాల్లో హిందూయేతరులకు షాపుల కేటాయింపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం..
Andhra Pradesh: సుప్రీంకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది.;
Andhra Pradesh: సుప్రీంకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. దేవాలయాల్లో హిందూయేతరులకు షాపుల కేటాయింపుపై గతంలో తాము ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బోపన్న ధర్మాసనం ఆదేశించింది. ఏపీ ప్రభుత్వంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
మతం ఆధారంగా దేవాలయాల్లో షాపుల కేటాయింపు తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. షాపుల వేలం పాటలో అన్నిమతాల వారు పాల్గొనవచ్చని తీర్పు ఇచ్చింది. అన్యమతస్థులకు హిందూ దేవాలయల్లో షాపుల కేటాయింపుపై నిషేదం విధిస్తూ గతంలో ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
షాపు యజమానులు దాఖలు చేసిన పిటిషన్లను 2019లో ఏపీ హైకోర్టు త్రోసిపుచ్చగా.. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో షాపు యజమానులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తుదితీర్పు వెలువరించింది.