Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ ఫిటిషన్ పైన సుప్రీంకోర్టులో కీలక వాదనలు..!

Raghurama Krishna Raju: ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ ఫిటిషన్ పైన సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగాయి.;

Update: 2021-05-21 09:10 GMT

Raghurama Krishna Raju: ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ ఫిటిషన్ పైన సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగాయి. సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి ఇచ్సిన మెడికల్ రిపోర్టును సుప్రీంకోర్టు పరిశీలించింది. రఘురామ కాలికి గాయం అయినట్లుగా నివేదికలో ఉంది. అలాగే కాళ్ళకి మరిన్ని గాయాలు ఉన్నట్టుగా తెలిపింది. రఘురామ కాలిపై ఉన్న గాయమే ఆయనని టార్చర్ చేశారన్న దానికి నిదర్శనమని ఆయన తరుపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ అన్నారు. వైద్య పరీక్షల నివేదికను ఇరు పక్షాలకి మెయిల్ ద్వారా సుప్రీంకోర్టు పంపించింది. అనంతరం విచారణను మధ్యాహ్నం రెండున్నరకి వాయిదా వేసింది. రఘురామకి వెంటనే బెయిల్ మంజూరు చేసి సీబీఐ విచారణకి ఆదేశించాలని న్యాయవాది ముకుల్‌ రోహత్గీ సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేశారు. అటు గాయాల పైన ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్‌ దవే అనుమానం వ్యక్తం చేశారు. గాయాలు స్వయంగా చేసుకున్నవేమో అంటూ వాఖ్యలు చేశారు. 

Tags:    

Similar News