Suryalanka Beach : సూర్యలంక బీచ్ ఫెస్టివల్ వాయిదా

Update: 2025-09-23 06:41 GMT

బాపట్లలోని సూర్యలంక తీరంలో ఈ నెల 26, 27, 28వ తేదీలలో నిర్వహించాల్సిన బీచ్ ఫెస్టివల్ వాయిదా పడింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యాటక శాఖ తెలిపింది. నిన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించిన ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి అధికారులకు ఇదే విషయాన్ని తెలియజేశారు. త్వరలోనే కొత్త తేదీలను నిర్ణయించనున్నట్లు వెల్లడించారు. . మొదట ఈ ఫెస్టివల్ ను భారీ ఎత్తున నిర్వహించి, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ ఫెస్టివల్ లో వాటర్ స్పోర్ట్స్, సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత కచేరీలు, స్థానిక వంటకాలు, ఇతర పర్యాటక కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంది.

Tags:    

Similar News