Tirupati : దేశంలోనే అత్యుత్తమ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా స్విమ్స్

Update: 2025-07-18 07:45 GMT

పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు స్విమ్స్ ను స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించారని, స్విమ్స్ దేశంలో అత్యుత్తమ వైద్య సేవా సంస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు చెప్పారు. ఇందుకోసం టీటీడీ అవసరమైన సదుపాయాలు కల్పిస్తుందని, ఏడాదికి రూ.140 కోట్లు అందిస్తూ, ఆసుపత్రి అభివృద్ధికి విశేష కృషి చేస్తోందని చెప్పారు.

స్విమ్స్ లో గురువారం అత్యాధునిక ఎం.ఆర్.ఐ, సిటీ స్కానర్ లను చైర్మన్ ప్రారంభించారు.

 

అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ,

– ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ. 22.01 కోట్ల విలువైన యంత్రాలను టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవెంకటేశ్వర వైద్య క‌ళాశాల‌ (SVIMS)కు విరాళంగా అందించింది

– IOL ( Indian Oil Corporation) తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద అత్యాధునిక వైద్య పరికరాలను అందించింది.

విరాళంగా అందించిన పరికరాలు :

– రూ. 14 కోట్లు విలువైన 3 టెస్లా ఎమ్‌ఆర్‌ఐ స్కానర్ (కంపెనీ పేరు MAGNETOM Vida) – 1

– 4డి సిటి సిమ్యులేటర్ సిస్టం – రూ. 8 కోట్లు (కంపెనీ పేరు SOMATOM go. Sim), – 1 (రేడియోథెరఫీ కోసం ఉపయోగిస్తారు)

– అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ యంత్రాలను స్విమ్స్ లో ఏర్పాటు చేస్తున్నాం.

• రాయలసీమలోనే అతి పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన స్విమ్స్ లో మాత్రమే అత్యాధునికి యంత్రాలు ఏర్పాటు

• కేన్సర్ రోగులకు ఎలాంటి సైడ్ ఎఫెక్స్ లేకుండా క్యాన్సర్ గడ్డను సులువుగా గుర్తించేందుకు ఈ యంత్రాలు ఉపయోగపడతాయి.

• మెదడు సంబంధ, క్యాన్సర్ గడ్డల గుర్తింపు, క్యాన్సర్ వ్యాధి ఏ ఏ అవయాలకు ఎంతెంత మోతాదులో ప్రాకిందో గుర్తించవచ్చు

• సంవత్సరానికి 2.5 లక్షల మందికిపైగా పేద రోగులకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించేందుకు ఈ యంత్రాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Tags:    

Similar News