TANA: కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం
వేడుకల్లో కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ప్రత్యేక ఆవిష్కరణగా నిలించింది.;
తానా 23వ మహాసభలు అమెరికా ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ కేంద్రంలో ఘనంగా జరుగుతున్నాయి.ఈ మహాసభలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ,ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు సన్మానం జరిగింది. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, కాన్ఫెరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ బండ్ల హనుమయ్య తదితరులు ప్రసంగించారు. ఈ వేడుకల్లో కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ప్రత్యేక ఆవిష్కరణగా నిలించింది. ఇక ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ప్రత్యేక నృత్యరూపకాలు అలరించాయి.