Anna Canteen : అన్న క్యాంటీన్లపై హైకోర్టు సానుకూలం.. సంబరాల్లో టీడీపీ శ్రేణులు..
Anna Canteen : అన్నా క్యాంటిన్‌లపై హైకోర్టు సానుకూలం వ్యక్తం చేయటంతో... టీడీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు;
Anna Canteen : అన్నా క్యాంటిన్‌లపై హైకోర్టు సానుకూలం వ్యక్తం చేయటంతో... టీడీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్‌లో...మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు టపాసులు కాల్చారు.
అన్నా క్యాంటిన్‌ల ద్వారా పేదోళ్లకు పట్టెడు అన్నం పెడితే తప్పేంటని ..హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు తీర్పు అధికార పార్టీకి చెంప పెట్టులాంటిదన్న మాజీ ఎమ్మెల్యే సౌమ్య... సీఎం, అధికారపార్టీ ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించారు.