పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాత్రి తంగేడు గ్రామంలో పల్లెనిద్ర చేసిన యరపతినేని.. ఉదయం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగేళ్ల వైసీపీ అరాచక పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యరపతినేని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు.