TDP Leaders Suicide Attempt: ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం..
TDP Leaders Suicide Attempt: అనంతపురంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.;
TDP Leaders Suicide Attempt: అనంతపురంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అనంతపురంలో టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టగా బంగినాగతో పాటు మరో వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేశారు. వెంటనే గుర్తించిన టీడీపీ కార్యకర్తలు, పోలీసులు.. ఇద్దిరినీ స్థానిక సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వీరిద్దరి పరిస్థితి విషయంగా ఉంది. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరీతో పాటు టీడీపీ కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకున్నారు.