TDP: న్యాయపోరాటానికి దిగిన లోకేష్
పరువు నష్టం కింద వైసీపీ నేతలపై పెట్టిన క్రిమినల్ కేసుల్లో వాగ్మూలం నమోదుకు స్వయంగా ఆయన కోర్టుకు హాజరవుతున్నారు.;
వైసీపీ నేతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. పరువు నష్టం కింద వైసీపీ నేతలపై పెట్టిన క్రిమినల్ కేసుల్లో వాగ్మూలం నమోదుకు స్వయంగా ఆయన కోర్టుకు హాజరవుతున్నారు. తన పిన్ని ఉమామహేశ్వరి ఆత్మహత్యపై అసత్య ప్రచారం చేశారంటూ.. వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై పరువు నష్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు. హెరిటేజ్ ద్వారా చంద్రబాబు కుటంబం సారా వ్యాపారం చేస్తోందన్న ఎమ్మెల్సీ పోతుల సునీతపైనా మంగళగిరి కోర్టులో లోకేష్ కేసు పెట్టారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, పోతుల సునీతపై దాఖలు చేసిన కేసుల్లో.. ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ లోకేష్ వాంగ్మూలాన్ని మంగళగిరి అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టు నమోదు చేయనుంది. అటు మంగళగిరి కోర్టు వద్దకు టీడీపీ నేతలు భారీగా చేరుకుంటున్నారు.