వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు..!
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు నిప్పులు చెరిగారు. జాబ్ క్యాలెండర్ పేరిట యువతను మోసించేసిందని ఆయన ఆరోపించారు.;
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు నిప్పులు చెరిగారు. జాబ్ క్యాలెండర్ పేరిట యువతను మోసించేసిందని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలోను రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్య క్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడంలేదని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. కొత్త ఉద్యోగాలు సంగతేమోగాని .. ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయే పరిస్థితి నెలకొందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని జగన్ నమ్మించారని రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.